ఖమ్మంలో నాలుగు దిక్కుల అభివృద్ది చేసిన చూపించినమని, ఖమ్మం నగరంలోని ప్రతి గల్లీలో ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు, వసతులు, సౌకర్యాలు కల్పించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వదే అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ.. నేడు ఖమ్మం అనేక మున్సిపాలిటీ లకు ఆదర్శంగా నిలిచిందని, మన ఖమ్మంలో జరిగి అభివృద్దిని చుసి ఇతర మున్సిపాలిటీ లు అనుకరిస్తూన్నాయన్నారు. మన ఖమ్మంలో జరిగిన పనులను అసెంబ్లీ లో మంత్రి కేటీఆర్ ఫోటోలను చూపిస్తూ మెచ్చుకుంటున్నారని, ఖమ్మం నగరం ఏ పరిస్థితి నుండి నేడు ఏ స్థాయికి చేరుకుంది అనేది మన కళ్ళ ముందే ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వచ్చినన్ని నిధులు ఖమ్మం జిల్లా చరిత్రలో ఎప్పుడూ రాలేదు.. ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి కేటిఆర్ సహకారం వల్లే ఇది సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే అభివృద్ది కొనసాగాలంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వంను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, హ్యాట్రిక్ కొట్టాలి.. అభివృద్ధిని కొనసాగించాలన్నారు మంత్రి పువ్వాడ. ఖమ్మం నగర ప్రజల సమస్యలు నా సమస్యలుగా భావించ. కాబట్టే నేడు గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం ను సీతాకొకచిలుకలా మార్చిన అని, ప్రజలకు కావాల్సిన ప్రధమ వసతి త్రాగునీరు.. అది నేడు ప్రతి ఇంటికి అందించానని ఆయన అన్నారు. ఒక్క ఇంటిని కూడా వదలకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు నల్లలు ఎర్పాటు చేసి అందిస్తున్నామని, నగరం నలు దిక్కుల అభివృద్ది జరిగింది. అది కేవలం ఖమ్మంకు మంత్రి పదవి రావడం వల్లే సాధ్యమైందన్నారు మంత్రి పువ్వాడ. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఖమ్మం కు మంత్రి పదవి ఇవ్వాళే.. అది కేసీఅర్ గారి వల్లే అయిందని, వారికి ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మంను ఉన్నత స్థాయిలో చూడాలని ఉందని, ఇప్పటికే ఆశించిన దాని కంటే ఎక్కువే అభివృద్ది చేసుకున్నామని, కానీ నా ఆలోచనలో చేయాల్సినవి మరెన్నో ఆవిష్కరణలు ఉన్నాయి. వాటన్నిటిని సాధిస్తామన్నారు మంత్రి పువ్వాడ. అది నా బాధ్యత, కర్తవ్యం.. ఖమ్మం నగరం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబమన్నారు.