Pushpa Pushpa Song Promo: ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది ‘పుష్ప:2 ది రూల్’. ‘పుష్ప ది రైజ్’తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోగా ఇప్పుడు రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దు అన్నట్టు అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టీజర్‌ని విడుదల చేయగా టీజర్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ దెబ్బతో సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు బన్నీ.
Aavesham :100 కోట్ల క్లబ్‌లోకి మరో మలయాళ సినిమా.. ఫహద్ ‘ఆవేశం’ తగ్గేదేలే!
తిరుపతి గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో టీజర్ కట్ చేసిన విధానం.. అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉండగా ఇప్పుడు సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను ఈ రోజు సాయంత్రం 04.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రకటించిన మేరకే సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప పుష్ప పుష్ప, పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ సాగిన 19 సెకన్ల ప్రోమో కేవలం ఫుల్ లిరికల్ సాంగ్ అప్డేట్ ఇచ్చేలా మాత్రమే కట్ చేశారు. పెద్దగా ఎక్సయిట్ చేసేలా అయితే అనిపించలేదు. ఈ ఫస్ట్ సింగిల్, టైటిల్ సాంగ్ మే 1న ఉదయం 11. 7 నిముషాలకి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక పుష్ప 2లో శ్రీవల్లి పాత్రలో మరోసారి రష్మిక నటిస్తుండగా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాసిల్ నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.