Aavesham Enters 100 Crore Club: మాలీవుడ్ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా సూపర్ హిట్‌లు కొడుతూ భారతీయ సినిమా మొత్తాన్ని తన వైపు చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్, తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే ఉన్న 100 కోట్ల క్లబ్బులు ఇప్పుడు మలయాళ సినిమా ముందు కూడా మోకరిల్లుతున్నాయి. మలయాళ సినిమాకి 2024 స్వర్ణయుగం అని అండర్‌లైన్ చేస్తూ మరో సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. రోమాంచం సినిమా సూపర్ హిట్ తర్వాత జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ నటించిన చిత్రం ‘ఆవేశం’ 100 కోట్ల వసూళ్లను సాధించింది. రంగ పాత్రలో ఫహద్ నటించగా, ఈ ఏడాది 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో మలయాళ చిత్రంగా ఈ ‘ఆవేశం’ నిలిచింది. మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, ఆడుజీవితం సినిమాలు ఈ ఏడాది 100 కోట్ల క్లబ్‌లో చేరాయి.
Varalaxmi: లైఫే రిస్క్… ‘శబరి’ సీట్ ఎడ్జ్ సైకలాజికల్ థ్రిల్లర్ – వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ
ఇక ఇప్పుడు ‘ఆవేశం’ మాలీవుడ్ చరిత్రలో 7వ 100 కోట్ల చిత్రంగా నిలిచింది. పులిమురుగన్, లూసిఫర్, 2018, మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, ఆడు జీవేతం ఇంతకు ముందు 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలుగా నిలిచాయి. ఇక ఏప్రిల్ 11న విషు స్పెషల్ గా ‘ఆవేశం’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన 13 రోజులకే ఫహద్ ఈ ఘనత సాధించాడు. మన్సూర్ అలీఖాన్, ఆశిష్ విద్యార్థి, సజిన్ గోపు, ప్రణవ్ రాజ్, మిథున్ జెఎస్, రోషన్ షానవాస్, శ్రీజిత్ నాయర్, పూజా మోహన్‌రాజ్, నీరజ్ రాజేంద్రన్, తంగం మోహన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ బ్యానర్‌పై అన్వర్ రషీద్, నజ్రియా నసీమ్ నిర్మించిన ఈ సినిమాకి వినాయక్ శశికుమార్ సాహిత్యం అందించగా సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు.