Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన సినిమా పుష్ప 2 . డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 1కు సీక్వెల్ గా తెరకెక్కింది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం సుకుమార్, బన్నీ తమ మూడేళ్ల సమయాన్ని వెచ్చించారు. ప్రతి క్షణం సినిమాకోసం ఎంతగానో కష్టపడ్డారు.
Read Also:Astrology: డిసెంబర్ 09, సోమవారం దినఫలాలు
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో భారీ కలెక్షన్లను రాబట్టుతోంది. బాలీవుడ్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ తో ట్రెండ్ సెట్ చేస్తోంది పుష్ప 2. విడుదలైన మొదటి రోజు పుష్ప – 2 ఏకంగా రూ. 72 కోట్లు కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా హిందీ స్టార్ హీరోలకు మరో సారి రుచి చూపింది. ఇప్పటి వరకు రూ.600కోట్లకు పైగా కొల్లగొట్టి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. తన మాస్ పెర్ఫామెన్స్ తో అల్లు అర్జున్ అదరగొడుతున్నాడు.
Read Also:DaakuMaharaaj : డాకు మహారాజ్ డబ్బింగ్ పూర్తి .. బాబీకి బాలయ్య ప్రశంసలు
ఇది ఇలా ఉంటే పుష్ప 2 సినిమా అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా ఆన్ లైన్ లో మొత్తం సినిమా లీక్ అయ్యింది. సినిమా మొత్తాన్ని HD ప్రింట్ లో లీక్ చేశారు. పుష్ప సినిమా ఒక్కటీ, రెండు వెబ్ సైట్ లలో మాత్రమే కాదు ఏకంగా పదుల సంఖ్యల వెబ్ సైట్ లలో రావడం షాకింగ్ గా ఉంది. ఇది సరిపోదనట్టు లీక్డ్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు లింకులు కూడా ఇచ్చారు మాహానుభావులు. ఎలాగోలా ఆన్ లైన్ నుంచి సినిమా కనుమరుగైనా షాకింగుగా నిన్న యూట్యూబులో స్ట్రీమింగ్ కు వచ్చింది. హిందీ వర్షన్ లో సినిమా మొత్తం స్ట్రీమింగుకు రావడంతో ఈ దెబ్బకి ఈ సినిమా పరిస్థితి ఏంటా అని అయోమయంలో పడ్డారు చాలా మంది. ఈ విషయానికి సంబంధించి మూవీ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది.