Pushpa 2: ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతూ పుష్ప చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం నెలరోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ దిరూల్ నిలిచిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం, భారతీయులు గర్వించదగ్గ చిత్రం ‘బాహుబలి-2’ వసూళ్లను పుష్ప-2 అధిగమించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప-2 ది రూల్‌మరో సారి ఇండియా వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్.. పుష్ప-2కు మరో ఇరవై నిమిషాల పవర్‌ఫుల్ ఫుటెజ్‌ను యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్‌ఫైర్ మరింత ఎక్స్‌ట్రా ఫైరీగా మారబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా మంగళవారం ప్రకటించారు మేకర్స్. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందిన పుష్ప-2 ది రూల్..ఈ సన్సేషన్ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది.
Read Also:Chandrababu: మోడీ అంటే నమ్మకం, విశ్వాసం
అల్లు అర్జున్ నట విశ్వరూపానికి, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డుల సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా బాక్సాఫీస్ దగ్గర ఇంకా సాలిడ్ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది.
Read Also:Racharikam: భయపెడుతున్న అప్సరా రాణి
సంక్రాంతి కానుకగా అభిమానులకు ‘పుష్ప 2’ మేకర్స్ ఓ ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు మరో 20 నిమిషాల అదనపు సీన్స్ యాడ్ చేసి రీలోడెడ్ వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శించాలని మేకర్స్ నిర్ణయించారు. జనవరి 11 నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ కు వస్తుందని ముందుగా ప్రకటించారు. అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల రీలోడెడ్ వెర్షన్‌ను జనవరి 17 నుంచి థియేటర్లలో స్క్రీన్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.
#Pushpa2Reloaded in cinemas from January 17th. #Pushpa2 #Pushpa2TheRule#WildFirePushpa https://t.co/rLmX4PECLf pic.twitter.com/XXcmRoOVts
— Mythri Movie Makers (@MythriOfficial) January 8, 2025