Racharikam: భయపెడుతున్న అప్సరా రాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ అనే చిత్రం తెరకెక్కింది. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేష్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లతో అందరిలోనూ అంచనాలను పెంచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ నటించిన తీరు, డిఫరెంట్ లుక్స్, నటించిన విధానం చాలా కొత్తగా ఉంది. విలేజ్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
Meenakshi Chaudhary: డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా!
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
“రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి.. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్పా రక్త సంబంధాలు ఉండవు” అంటూ సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. విజువల్స్, యాక్షన్, బీజీఎం ఇలా అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వేంగి, ఆర్య సాయి కృష్ణ కెమెరా వర్క్, రామ్ ప్రసాద్ మాటలు ఈ ట్రైలర్ కి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు. అప్సర రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!