Site icon NTV Telugu

COVID-19: భారత్‌లో కరోనాతో వ్యక్తి మృతి.. వైద్యులు ఏం చెప్పారు?

Panjab

Panjab

పంజాబ్‌లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. చండీగఢ్‌ రాజధాని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (GMCH)లో ఈ రోజు ఉదయం 35 ఏళ్ల రోగి మృత్యువాత పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో లూథియానాలోని సమ్రాలా నుంచి చండీగఢ్‌కు రిఫర్ చేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రోగికి ఇప్పటికే కాలేయంలో గడ్డ ఉందని, ఇతర వ్యాధులతో (కొమొర్బిడ్ పరిస్థితులు) బాధపడ్డాడు. ఒకటి కంటే ఎక్కువ రోగాలు చుట్టుముట్టడంతో అతని పరిస్థితి విషమించింది.

READ MORE: OG Shooting: OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్

ఆరోగ్యం నిరంతరం క్షీణించడం చూసి, వైద్యులు రోగికి COVID-19 పరీక్షలు చేయించారు. నివేదికలో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత రోగిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కానీ వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఏడాదిలో ఇదే తొలి కోవిడ్ మరణం అని చెబుతున్నారు. కాగా.. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నివాసి అని, కానీ అతను లూధియానాలో కూలీగా పనిచేసేవాడని చెబుతున్నారు.

READ MORE: Minister Gottipati Ravi: గత ప్రభుత్వ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు..

కాగా.. దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు.

Tags:

Exit mobile version