దేశ వ్యాప్తంగా ఎండలు ఏ రీతిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయిస్తూనే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇంట్లో ఉన్న వేడి తగ్గక ముందే.. మళ్లీ సూర్యుడు భగభగ మండుతూ నిప్పులు చిమ్ముతున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక పట్టణాల్లో వాహనదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలు నిలిచిపోతే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఉక్కపోత, చెమటలతో గిజగిలాడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. వాహనదారులకు వడదెబ్బ తగలకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నీడను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మండుటెండల్లో వాహనదారులు ఇబ్బంది పడకుండా పందిళ్ల మాదిరిగా గ్రీన్‌నెట్స్ ఏర్పాటు చేసి పుదుచ్చేరి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. రాష్ట్ర ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు సిగ్నళ్ల దగ్గర కొంత దూరం వరకు ఈ గ్రీన్ నెట్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించేలా పుదుచ్చేరి అధికారులు చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తే.. ఎంత బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్స్‌లు కట్టించుకోవడం కాదు.. వాహనదారుల ఇబ్బందులను కూడా పట్టించుకోవాలంటూ ఆయా ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐదుగురు స్టార్ బౌలర్లు దూరం!
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు మరో నాలుగు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు ఉక్కపోత విపరీతంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Covishield: ఆ సర్టిఫికేట్లో నుంచి మోడీ ఫోటో తొలగింపు..