PSL 2026: వార్నర్, స్మిత్ బ్యాట్ పడితే బాంబులు పేలుస్తాం! పీఎస్ఎల్ను వణికిస్తున్న ఉగ్రవాదుల ప్రకటన..
- పీఎస్ఎల్ 2026పై ఉగ్ర నీడ
- వార్నర్, స్మిత్‌లకు డెత్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL 2026: మరో మూడు రోజుల్లో ప్రారంభం కావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్‌ను ఉగ్రవాదుల భయం వణికిస్తోంది. పాకిస్థాన్‌లో క్రియాశీలంగా ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం డైరెక్ట్‌గా విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక సీనియర్ కమాండర్ పేరుతో విడుదలైన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
READ ALSO: Project Hail Mary: ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కోసం హృతిక్ రోషన్
Also Read
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
వార్నర్, స్మిత్‌లకు ప్రత్యక్ష హెచ్చరికలు..
ఈసారి పీఎస్ఎల్లో ఆస్ట్రేలియా దిగ్గజాలు డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్ కెప్టెన్), స్టీవ్ స్మిత్ (ముల్తాన్ సుల్తాన్స్) వంటి స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన తాజా ప్రకటనలో వీరిద్దరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించడం క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. “మీ ఆటగాళ్లను పాకిస్థాన్‌కు పంపకండి. మైదానంలో వారికి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు” అంటూ వివిధ క్రికెట్ బోర్డులను ఉగ్రవాదులు బహిరంగంగా హెచ్చరించారు. వార్నర్, స్మిత్‌తో పాటు మార్నస్ లబుషేన్, మోయిన్ అలీ, డెవాన్ కాన్వే, ఆడమ్ జంపా వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు.
పీసీబీ సంచలన నిర్ణయం..
పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అత్యవసర నిర్ణయాలు తీసుకున్నారు.. భద్రతా కారణాల దృష్ట్యా పీఎస్ఎల్ 2026 మ్యాచ్‌లన్నీ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. మార్చి 26న జరగాల్సిన గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీని సైతం పీసీబీ రద్దు చేసింది. ముందుగా నిర్ణయించిన వేదికలను మార్చి, కేవలం లాహోర్, కరాచీ నగరాలకే ఈ మెగా టోర్నీని పరిమితం చేశారు. ఇదే సమయంలో మార్చి 26 నుంచి స్టార్ట్ కానున్న ఈ టోర్నీలో మొత్తం 44 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే, తాజా బెదిరింపుల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో కొనసాగుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇప్పటికే కొందరు ఆటగాళ్లు పీఎస్ఎల్ వదిలి ఐపీఎల్ (IPL) వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్‌గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!
తాజావార్తలు
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!