NTV Telugu Site icon

Rythu Bharosa: రైతు భరోసా నిబంధనులు ఇవే.. వారికి నిరాశే..

Rythu Bharosa

Rythu Bharosa

వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని సర్కార్ అభిప్రాయం వ్యక్త చేసింది. ఈ మేరకు రైతు భరోసా పథకంలో కొత్త మార్పులు చేసింది. ఈ పథకం రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి, ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుందని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

READ MORE: Car Driver: 10 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించిన కారు డ్రైవర్!

రైతు భరోసా పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. జనవరి 26, 2025 నుంచి అమలు చేయనుంది. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000కు పెంచింది. దీంతో పాటు ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. భూ భారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనుంది. ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఆర్‌బీఐ నిర్వహించే డీబీటీ (DBT) పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఈ పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్‌ఐసీ (National Informatics Centre), ఐటీ (IT) ఈ పథకానికి భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.

READ MORE: Bhatti Vikramarka: నేడు నాగర్‌కర్నూల్‌లో డిప్యూటీ సీఎం పర్యటన.. మార్కండేయ లిఫ్ట్ ప్రారంభోత్సవం..

Show comments