వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని అభిప్రాయం వ్యక్త చేసింది.