ప్రస్తుతం ఎక్కడ చూసిన లేఆఫ్స్ భయాలే నెలకొన్నాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఉన్నపళంగా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి కంపెనీలు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. మరి మీరు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 52 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో BE, BTech లేదా BSc డిగ్రీని పొంది ఉండాలి.
Also Read:Mahesh Kumar: 2-3 రోజుల్లో నిర్ణయం..! లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 32 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండకూడదు. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. SC, ST, దివ్యాంగుల అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.
Also Read:Tejashwi Yadav: గోడి మీడియాను నమ్మొద్దు.. సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ. 40,000, రెండవ సంవత్సరం రూ. 45,000, మూడవ సంవత్సరం రూ. 50,000, నాల్గవ సంవత్సరం రూ. 55,000 జీతం లభిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు రూ. 472 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఇంకా, SC/ST, వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 20 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.