జన సమితి ఉంటుంది.. అనుమానం వద్దని తెలిపారు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందని, కేసీఆర్ ప్రభుత్త్వాన్ని ఆస్తులు పెంచుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నిరంకుశ పాలన ప్రజల మీద రుద్దుతున్నారని, కేసీఆర్ వచ్చాకా… రాజకీయాలు కార్పోరేట్ గా మారిందన్నారు. అధికారాన్ని, డబ్బులను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారని, రాజకీయ విశ్లేషణ కూడా మార్కెటికరణ గా మార్చేశారన్నారు. ప్రజలకు ప్రభుత్వం దూరం అయ్యిందని, దుర్మార్గ.. నిరంకుశ పాలన కొనసాగుతుందని, ప్రజల చుట్టూ రాజకీయం తిప్పాలన్నారు. అందరిని ఏకతాటిపైకి తీసుకు వస్తామని, . ఉద్యమంలో కలిసి వచ్చిన వారిని అందరిని ఏకం చేస్తామని కోదండరాం వెల్లడించారు. ఈ నెల 21 నుండి యాత్ర చేస్తున్నామని, తెలంగాణ పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తామని, ధరణి లోపాలు వెంటనే సరిదిద్దాలన్నారు.
Also Read : Cucumber: కీరదోసతో మరింత అందం.. ఇంకెందుకు ఆలస్యం తినేయండి..!
పంట నష్టపోయిన వారికి పరిహారం ఇస్తానన్న 10 వేలు వెంటనే విడుదల చేయాలని, కేంద్రం, రాష్ట్రం కలిసి సింగరేణిని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం మీద రాష్ట్రం.. రాష్ట్రం మీద కేంద్రం విమర్శలు చేసుకుంటున్నాయని, కానీ రెండు ప్రభుత్వాలు సింగరేణిని దోచుకుంటున్నారన్నారు. జనసమితి రాష్ట్ర అధ్యక్దుడు గా రెండో సారి కోదండరాం ఎన్నికయ్యారు. అయితే.. ఇదే ఆఖరి .. నెక్ట్ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామని ఆయన వెల్లడించారు. దిక్కులు చూడటం మానేసి..మా పని మేము చేసుకుందాం అని డిసైడ్ అయ్యామన్నారు. ఆ తర్వాతే.. పొత్తు లు.. ఎత్తులు అంటూ కోదండరాం వ్యాఖ్యానించారు. పైసలతో రాజకీయం తెలంగాణను విధ్వంసం చేస్తున్నాయని, కేసీఆర్ పాలన లో రాజకీయంగా దోపిడికి గురికాని ఊరు లేదన్నారు. ఎన్నికలు ఆటగా మారాయి.. ప్రజల భవిష్యత్ కి వేదికగా మారాలని మా ప్రయత్నం.. గెలుపు ఓటమి సమస్య కాదు.. కొట్లాడటం అనేది అజెండా.. అంతకు మించిన మార్గం మా దగ్గర లేదు.. ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదు..’ అని ఆయన అన్నారు.
Also Read : Bengaluru: 25 మంది ఆఫ్రికా జాతీయుల అరెస్ట్.. డ్రగ్స్ వ్యతిరేక కేసులు నమోదు..