Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘సింగ్ గీతం’. 94 ఏళ్ల వయసులోనూ ఒక టీనేజర్లాంటి ఉత్సాహంతో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగ్ అశ్విన్ విలేకర్లతో ముచ్చటిస్తూ పలు సంచలన విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమా ప్రయాణం వెనుక ఒక అద్భుతమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. “గతంలో నేను కమల్ హాసన్ ని కలిసినప్పుడు ఒక షాకింగ్ విషయం చెప్పారు. సింగీతం క్లాసిక్ మూవీ ‘పుష్పక విమానం’ కంటే ముందే ఈ ‘సింగ్ గీతం’ కథను కమల్ గారికి వినిపించారట. కానీ అప్పట్లో ఉన్న కొన్ని ప్రాజెక్టుల వల్ల అది కుదరలేదు. ‘మహానటి’ సినిమా తర్వాత సింగీతం ఈ కథను నాకు చెప్పారు. ఇప్పటికీ ఈ కథ వింటే ఈ జనరేషన్ కోసం రాసిన కథలాగే అనిపిస్తుంది. ఆయన సినిమాలు ఎప్పుడూ టైమ్‌లెస్ గా ఉంటాయి” అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
Also Read
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, మంచి వినోదాత్మక చిత్రం అని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. “ఇది ‘కుబేరపురం’ అనే ఒక ఊహాజనిత గ్రామంలో ఉండే గోల్డ్ మైన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ స్టోరీ. ఆ ఊరికి, ఆ మైన్స్‌కు ఉన్న కనెక్షన్ ఏంటనేది సింగీతం సిగ్నేచర్ ట్రేడ్‌మార్క్ హ్యూమర్, హ్యూమానిటీతో అద్భుతంగా చూపించారు” అని తెలిపారు. “పెద్ద నటీనటులు ఉంటే వారి ఇమేజ్ ప్రభావం కథపై పడుతుంది. అందుకే కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు సహజంగా ఫీల్ అవ్వడం కోసం సింగీతం స్వయంగా కొత్తవాళ్లను ఎంపిక చేశారు” అని అన్నారు.
ఈ సినిమాలో ఉన్న అతిపెద్ద ప్రయోగం ఏంటంటే.. ఇందులో సాధారణ డైలాగ్స్ ఉండవు, అన్నీ పాటల రూపంలోనే వస్తాయి. “ఇందులో మాటలన్నీ పాటల్లాగే సాగుతాయి. దేవిశ్రీ ప్రసాద్ ఎక్కడా నాన్‌స్టాప్ మ్యూజిక్ వింటున్నామనే ఫీలింగ్ రాకుండా చాలా సహజంగా, ఎంటర్టైనింగ్గా చేశారు. ఈ ప్రయోగం వల్లనే సినిమాను ఇతర భాషల్లోకి తీసుకెళ్లడం కొంచెం కష్టమైన ప్రక్రియగా మారింది. ప్రతి భాషలోనూ డైలాగ్స్‌ను మళ్లీ సంగీతబద్ధంగా రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తమిళంలో రిలీజ్ చేస్తున్నాం, మిగతా భాషల గురించి కూడా ఆలోచిస్తున్నాం” అని నాగ్ అశ్విన్ వివరించారు.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..