ఫస్ట్ ఇండియన్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ హీరోగా, లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించి ఈ చిత్రాన్ని ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.…
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావుకు సతి వియోగం కలిగింది. ఆయన భార్య లక్ష్మీ కళ్యాణీ చెన్నయ్ లో శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. 62 సంవత్సరాల తమ దాంపత్య జీవితానికి తెరపడిందని ఆయన అన్నారు. యుక్త వయసులోనే చిత్రసీమలోకి అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాసరావుకు అరవైయేళ్ళకు పైగా ఆమె చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్…
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావులో సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. కొన్ని కన్నడ చిత్రాలతో పాటు యానిమేషన్ మూవీ ‘ఘటోత్కచ’కు, తెలుగు సినిమా ‘వెల్ కమ్ ఒబామా’కు ఆయన స్వరాలు సమకూర్చారు. తొంభై వసంతాలు దరిచేరినా ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు సింగీతం శ్రీనివాసరావు. ఇటీవల కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. దర్శకత్వంతో పాటు రచన, సంగీతం ఈ రెండింటినీ సింగీతం ఇష్టపడతారాయన. ఇప్పటికీ సంగీత సాధన చేస్తూ, ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుంటారు.…