Site icon NTV Telugu

Priyanka Chopra : ప్రియాంకా చోప్రా డబుల్ ధమాకా.. రాజమౌళి ‘వారణాసి’తో పాటు.. ఆ భారీ సీక్వెల్‌లో కూడా..?

Priyanka Chopra

Priyanka Chopra

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు! ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతమైన నటనతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లో రెండు మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో భాగం కాబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గుప్పుమంది. అందులో మొదటిది.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే హైప్‌ను క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోందని తెలిసి.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also Read : Andhra King Taluka : ఇది మిస్ అయితే నిజంగా బాధపడేదాన్ని – భాగ్యశ్రీ

అయితే, కేవలం ‘వారణాసి’తోనే సరిపెట్టుకోకుండా, ప్రియాంక మరో మెగా ప్రాజెక్ట్‌కు సైన్ చేసిందనే లీక్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదే.. రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కల్కి’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘కల్కి 2’. ఈ మొదటి భాగంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఓ కీలక పాత్ర పోషించింది. కానీ, సీక్వెల్‌లో ఆమె నటించబోదని నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో, ఆమె ప్లేస్‌లో ఇప్పుడు ఏకంగా ప్రియాంకా చోప్రా రంగంలోకి దిగబోతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, వైజయంతి పిక్చర్స్ బ్యానర్ ఈ భారీ మూవీని నిర్మిస్తోంది. మరి ఈ డబుల్ ధమాకా నిజమా కాదా అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే!

Exit mobile version