Priya Warrior : ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? సిల్లీ క్వశ్చన్ ఆమె గుర్తుండకపోవడం ఏంటి? ఒక్క కన్ను గీటుతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన భామ. తన చేతినే గన్‌గా మలిచి ట్రిగ్గర్ చేస్తే ప్రధాని మోదీ సైతం పడిపోడియినట్టుగా మన మీమర్స్ క్రియేట్ చేసి విపరీతంగా ఫన్ జెనరేట్ చేశారు. ఈ ఒక్క సీన్‌తో ఎంతగా పాపులర్ అయిపోయిందో చెప్పనక్కర్లేదు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఈ మలయాళీ కుట్టి ఈ సీన్ చేసిన ఒరు ఆధార్ లవ్ మూవీ మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
Read Also: Ginna : జిన్నా సినిమా ప్రీ రిలీజ్ రేపే..
తెలుగులో నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత తేజ సర్జ తో కలిసి ఓ సినిమా చేసింది. కానీ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట చెలరేగిపోతోంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు కోలీవుడ్ లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హీరో ధనుష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది ఈ భామ.
ఇక అమ్మడు కూడా చాలా మంది హీరోయిన్ల మార్గాన్నే ఎంచుకుంటోంది. ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోల దృష్టిలో పడాలంటే ఏం చేస్తారు? వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఇండస్ట్రీ నీళ్లు బాగా వంట పట్టినట్టున్నాయి. అందుకే అవకాశాల కోసం హీరోలను టార్గెట్ చేస్తోంది. అటు సోషల్ మీడియా.. ఇటు మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోలపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. అమ్మడు అనతి కాలంలో బాలీవుడ్ స్థాయికి ఎదిగింది. టాలీవుడ్‌కి టచ్ అనే చిత్రం ద్వారా పరిచయమైనప్పటికీ ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు.ఇక తాజాగా కోలీవుడ్‌పై కూడా ఈ ముద్దుగుమ్మ ఫోకస్ పెట్టింది.
Read Also: Unstoppable 2 : 24గంట్లో వన్ మిలియన్ వ్యూస్.. బాలయ్య సెన్సేషన్
ఈ క్రమంలోనే ప్రియా వారియర్.. ధనుష్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ హీరోకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేయడం వంటివి చేస్తోంది. ఎంతలా ఆమె పోస్టింగ్స్ పెడుతోందంటే..అందరూ గుర్తించేంతలా. ఇంటర్వ్యూలో ఆమెనే ఏకంగా ఆ క్వశ్చన్ అడిగేంతలా పోస్టింగ్స్ పెడుతోంది. ఇటీవల జరిగిన ఫిలింపేర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో ధనుష్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు ధనుష్ అంటే క్రష్ అని.. మాటల్లో చెప్పలేనంత పిచ్చి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ధనుష్ సరసన నటించాలని కోరుకుంటున్నానని.. త్వరలోనే తన కోరిక నెరవేరుతుందని చెప్పుకొచ్చింది.