ఇంటర్వ్యూ కి పిలిచి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఫతేనగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫతేనగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి ఓ యువతి ఈనెల 21న వెళ్లింది. ఆమెకు నెలకు రూ.22 వేల జీతం ఇస్తానని, ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలని, విజిటర్లతో మాట్లాడాలని స్కూల్ కరెస్పాండెంట్ చెప్పాడు. తన పీఏగా కూడా ఉండాలని చెప్తూ.. అసభ్యకరంగా ప్రవర్తించినట్లు యువతి పోలీసులకు తెలిపింది. గదికి గొళ్ళెం పెట్టి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొబైల్‌లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించగా.. ఫోన్ లాక్కున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసిన సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.