Modi: వారణాసికి సంబంధించిన ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేసిన ప్రధాని మోడీ

Modi Road Show

Modi Road Show

ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా తన సిటింగ్ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని అభివర్ణించారు. ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

READ MORE: RCB vs CSK: బెంగళూరు, చెన్నై మ్యాచ్‌ కష్టమే.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు!

మోడీ ఉద్వేగంతో ఇలా మాట్లాడారు.. “కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చింది. 2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ(నది) నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించింది. ఈ పదేళ్ల కాలం తర్వాత.. ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను. ఈ సమయంలో కాశీతో నా బంధం దృఢంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాంతం నాది. ఒక తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నాను’’ అని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. నామినేషన్ కు ముందు రోజు సోమవారం సాయంత్రం వారణాసి చేరుకున్న మోడీ.. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆరు కి.మీ. మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు. రాత్రికి ఇక్కడే బస చేశారు. ఈ ప్రాంతంలో మూడోసారి పోటీకి నామినేషన్ వేయనున్నారు. ఇక్కడ ఏడోదశలో జూన్‌ ఒకటిన పోలింగ్ జరగనుంది. మరో కొద్ది క్షణాల్లో మోడీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.