Modi: వారణాసికి సంబంధించిన ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా తన సిటింగ్ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని అభివర్ణించారు. ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.
READ MORE: RCB vs CSK: బెంగళూరు, చెన్నై మ్యాచ్ కష్టమే.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
మోడీ ఉద్వేగంతో ఇలా మాట్లాడారు.. “కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చింది. 2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ(నది) నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించింది. ఈ పదేళ్ల కాలం తర్వాత.. ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను. ఈ సమయంలో కాశీతో నా బంధం దృఢంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాంతం నాది. ఒక తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నాను’’ అని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. నామినేషన్ కు ముందు రోజు సోమవారం సాయంత్రం వారణాసి చేరుకున్న మోడీ.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆరు కి.మీ. మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు. రాత్రికి ఇక్కడే బస చేశారు. ఈ ప్రాంతంలో మూడోసారి పోటీకి నామినేషన్ వేయనున్నారు. ఇక్కడ ఏడోదశలో జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది. మరో కొద్ది క్షణాల్లో మోడీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
अपनी काशी से मेरा रिश्ता अद्भुत है, अभिन्न है और अप्रतिम है… बस यही कह सकता हूं कि इसे शब्दों में व्यक्त नहीं किया जा सकता! pic.twitter.com/yciriVnWV9
— Narendra Modi (@narendramodi) May 14, 2024
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..