Kartavya Bhavan 3 Inaugurate: దేశ రాజధాని న్యూఢిల్లీలో అధికార పరిపాలనకు మౌలిక భద్రతను అందించేందుకు రూపొందించిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాల్లో ఒక్కటైన కర్తవ్య భవన్-3ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆగష్టు 6) అధికారికంగా ప్రారంభించారు. ఇది మొత్తంగా 10 భవనాల సముదాయ నిర్మాణం. ప్రస్తుతం ఢిల్లీలో విస్తరించి ఉన్న గృహ, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ లఘు మధ్య పరిశ్రమలు (MSME), డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT), పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అడ్వైజర్ (PSA) వంటి శాఖల కార్యాలయాలు ఇక కర్తవ్య భవన్-3లో ఒకేచోట పనిచేయనున్నాయి. ఈ సెంట్రలైజ్డ్ భవనం ఆధునిక వసతులు, సామర్థ్యం, సహకార వాతావరణాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.
Donald Trump: అర్ధరాత్రి ‘సుంకాల’ బాంబు పేల్చనున్న ట్రంప్.. భారత్‌పైనేనా?
ఈ నేపథ్యంలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో ఉన్న శాఖలను కొత్త భవనాలకు తరలించి.. ఆ ఐకానిక్ భవనాలను ఇండియన్ మిథాలజీ, ఆధునిక చరిత్రను ప్రతిబింబించే మ్యూజియాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. 1950 – 1970ల మధ్య నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్ మరియు నిర్మాణ్ భవన్ వంటి పాత భవనాల నుండి ప్రస్తుతం అనేక కీలకమైన కేంద్ర మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్రకారం ఈ నిర్మాణాలు ఇప్పుడు నిర్మాణాత్మకంగా పాతవిగా పరిగణించబడుతున్నాయి.
Intelligence Alert: దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్.. భద్రతకు ముప్పు!
కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్ట్ లో భాగంగా పది కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. ఇందులో 2, 3 భవనాలు ఇప్పటికే నిర్మాణంలో ఉండగా, అక్టోబర్ 2026 నాటికి 6, 7 భవనాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రి భవన్, కృషి భవన్ మొదలైన పాత భవనాల్లో పనిచేస్తున్న శాఖలను కస్తూర్బాగాంధీ మార్గ్, మింటో రోడ్, నేతాజీ ప్యాలెస్ వంటి నూతన ప్రదేశాలకు తాత్కాలికంగా రెండు సంవత్సరాల పాటు తరలించనున్నట్లు మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. పునర్నిర్మాణ ప్రణాళికలో నేషనల్ మ్యూజియం, నేషనల్ ఆర్కైవ్స్, జవహర్ లాల్ నెహ్రూ భవన్ (విదేశాంగ శాఖ), డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియం, వాణిజ్య భవన్ వంటి కొత్త నిర్మాణాలు యథాతథంగా ఉంచనున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates Kartavya Bhavan at Kartavya Path in Delhi.
Kartavya Bhavan has been designed to foster efficiency, innovation, and collaboration by bringing together various Ministries and Departments currently scattered across Delhi. It will… pic.twitter.com/xT7NYyFfy7
— ANI (@ANI) August 6, 2025