Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సుంకాల లిస్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4:30 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 2 గంటలకు, ఆయన ఓవల్ ఆఫీసులో కీలక ప్రకటన చేయనున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఉత్కంఠ రాజకీయం, వ్యాపార రంగాల్లోనూ తీవ్రంగా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ట్రంప్ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ మంచి వ్యాపార భాగస్వామి కాదు, ఎందుకంటే వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారు అంటూ విమర్శించారు. అంతేకూండా భారత్‌పై భారీగా సుంకాలు పెంచుతానంటూ హెచ్చరించారు. ఇప్పటికే 25% టారిఫ్‌లు విధించిన ట్రంప్, ఇప్పుడు మరింత గట్టిగా ‘సుంకాల’ బాంబు ప్రయోగించే అవకాశముందని తెలుస్తోంది.
Intelligence Alert: దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్.. భద్రతకు ముప్పు!
ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కోఫ్ మాస్కోలో పర్యటిస్తున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపనున్నారు. ఈ భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. దీనిని బట్టి రష్యా కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే, తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా.. ట్రంప్ మిగతా రంగాలపైనా స్పందించారు. అమెరికా బ్యాంకులు రాజకీయ వివక్షతో వ్యవహరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. అలాగే ఫెడ్ ఛైర్మన్ పదవికి సంబంధించి నలుగురు పోటీదారులు ఉన్నారని, ఆ అంశంపైనా ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు.
Indo-Pak Clash: మరోసారి భారత్‌పై పాక్ అసత్య ఆరోపణలు.. కాశ్మీర్ మాదేనంటూ వ్యాఖ్య!
వీటితోపాటు ట్రంప్ ఇటీవలే సెమీకండక్టర్ పరిశ్రమ, ఔషధ రంగాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇవన్నీ కలిపి చూస్తే, అమెరికాలో నేడు మధ్యాహ్నం జరగనున్న మీడియా సమావేశంలో ఎన్నో ఆసక్తికర ప్రకటనలు వెలువడే అవకాశముంది. మొత్తంగా ట్రంప్ నిర్వహించే ఈ మీడియా సమావేశంపై ప్రపంచం మొత్తం ఎదురుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.