Mosquitoes Prevention Trees: వానాకాలం వచ్చిందంటే చాలు ఇంటి చుట్టూ దోమలు తెగ తిరిగేస్తుంటాయి. దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫైడ్ లాంటివి ఈ సీజన్ లో చాలా త్వరగా వచ్చే్స్తూ ఉంటాయి. అయితే దోమల నుంచి తప్పించుకోవడానికి మనం చాలానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. క్రీమ్‌లు, లోషన్‌లు, స్ప్రేలు, పొగబెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం. ఆల్ అవుట్, మస్ కిటో కాయిల్ లాంటి చాలా వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాలైన మొక్కలను పెంచడం ద్వారా కూడా దోమలు మన ఇంటిలోకి రాకుండా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి:
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే అవి మాత్రమే కాకుండా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది తులసి మొక్క. దాని సువాసన,దోమలను దూరంగా ఉంచుతుంది.
వేప:
దోమలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచే సామర్థ్యం ఉన్న మొక్క వేప. దీనిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చెట్టును ఇంటి బయట నాటడం వల్ల ఇంట్లోకి దోమలు రావడం తగ్గుతాయి. దోమల నివారణ కు ఉపయోగించే అనేక పదార్ధాల్లో కూడా వేప పొడిని ఉపమోగిస్తారు.
క్యాట్నిప్:
క్యాట్నిప్ అనేది పుదీనా కుటుంబానికి చెందిన మొక్క. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది శాశ్వత మొక్క. అంటే ఇది సూర్యుడు, నీడ రెండింటిలోనూ పెరుగుతుంది. దీని పువ్వులు తెలుపు, లావెండర్ కలర్స్ లో ఉంటాయి. ఈ మొక్క పై కొన్ని పరిశోధనలు చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇది పురుగుమందు కంటే 10 రెట్లు ఎక్కువ ప్రభావవంతమైనదని తేలింది.
సిట్రోనెల్లా:
సిట్రొనెల్లా దోమల నుంచి రక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. దీని సువాసన దోమలను దూరంగా ఉంచుతుంది.
అజెరాటం:
అజెరాటం కూడా పురుగుులు, దోమలు రాకుండా చూసే మొక్కల్లో ఒకటి. కొమరిన్ ఉత్పత్తి చేసే ఈ మొక్కపై లేత నీలం, తెలుపు పువ్వులు పెరుగుతాయి. కొమరిన్ ఒక రకమైన బలమైన వాసనను కలిగి ఉంటుంది. దీని వల్ల దోమలు ఆ ప్రాంతానికి రావు.
గుర్రపు డెక్క:
దోమలను తరిమికొట్టడంలో గుర్రపుడెక్క కూడా చాలా సహాయపడుతుంది. ఈ మొక్కకు సాధారణంగా ఎలాంటి సంరక్షణ అవసరం లేదు. దీని నూనెలో ఉన్న థైమోల్ కారణంగా, ఇది యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. దీని ఘాటూన వాసన కారణంగా కూడా దోమలు దరికి చేరవు.
నిమ్మ ఔషధ తైలం:
ఇది లోపల పెంచుకునే ఒక మొక్క. దీని ఆకులలో సిట్రోనెల్లా పుష్కలంగా కనిపిస్తుంది. ఇది కూడా దోమల వికర్షకాల తయారీలో ఉపయోగించబడుతుంది.
బంతి పువ్వు:
బంతి పువ్వు.. ఇది సాధారణంగా మనందరికి తెలిసిన పువ్వే. దీని నుంచి వాసన ఎక్కువుగా ఘాటుగా వస్తూ ఉంటుంది. ఈ వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. అందుకే ఈ మొక్కను చిన్న కుండీలో ఇంట్లో పెంచుకున్నా దోమలు లోపలికి రావు.