PM Modi: నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. సమాజానికి వారు చేసిన సేవలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరిగింది. ఖాళీల భర్తీ నేపథ్యంలో వీరి నామినేషన్ జరిగింది. నామినేట్ చేసిన వారిలో ఉజ్వల్ నికమ్, సదానందన్ మాస్టర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, డా. మీనాక్షి జైన్ లు ఉన్నారు. ఇక వీరి వివరాలు పరిశీలిస్తే..
Read Also:Kollu Ravindra: పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారని హౌస్ అరెస్ట్ డ్రామా..
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ఉజ్వల్ నికమ్ 26/11 ముంబయి దాడుల్లో కసబ్ కేసు ప్రాసిక్యూటర్‌గా నిలిచిన ప్రఖ్యాత న్యాయవాదిగా గుర్తింపు పొందారు. సదానందన్ మాస్టర్ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్తగా ప్రసిద్ధి గాంచారు. ఇక హర్షవర్ధన్ ష్రింగ్లా మాజీ విదేశాంగ కార్యదర్శి, దౌత్యనాయకుడుగా ఉన్నారు. చివరిగా డా. మీనాక్షి జైన్ చరిత్రకారిణి, రాజకీయ శాస్త్రవేత్త, విద్యావేత్తగా పేరుగాంచారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలుగురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ట్వీట్లు చేశారు.
ఆయన ఉజ్వల్ నికమ్ గురించి మాట్లాడుతూ.. ఆయన న్యాయవాద వృత్తిలో రాజ్యాంగ విలువల పట్ల చూపిన నిబద్ధతను మోదీ ప్రశంసించారు. నికమ్ సాధారణ పౌరుల పక్షాన నిలవడాన్ని గుర్తుచేశారు. అలాగే సదానందన్ మాస్టర్ పై మోదీ స్పందిస్తూ.. ఆయన ధైర్యానికి, సామాజిక సేవకు ప్రశంసల వర్షం కురిపించారు. అన్యాయానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటాలు దేశానికి ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.
Read Also:Teenmaar Mallanna: ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కార్యకర్తల దాడి..!
హర్షవర్ధన్ ష్రింగ్లా గురించి ప్రధాని మాట్లాడుతూ.. ఆయన వ్యూహాత్మక ఆలోచనాపరుడు, విదేశాంగ విధానాల్లో కీలక పాత్ర పోషించిన దౌత్యవేత్త అని కొనియాడారు. అలాగే డాక్టర్ మీనాక్షి జైన్ సేవలను మోదీ వివరించారు. ఆమె విద్య, చరిత్ర, సాహిత్యం రంగాల్లో చేసిన కృషి విద్యారంగాన్ని సుసంపన్నం చేసిందని పేర్కొన్నారు. ఈ నామినేషన్లతో రాజ్యసభకు ప్రజా జీవితంలో అనుభవం కలిగిన వివిధ రంగాల ప్రముఖులు ప్రాతినిధ్యం వహించనుండడం విశేషం.
Shri Ujjwal Nikam’s devotion to the legal field and to our Constitution is exemplary. He has not only been a successful lawyer but also been at the forefront of seeking justice in important cases. During his entire legal career, he has always worked to strengthen Constitutional…
— Narendra Modi (@narendramodi) July 13, 2025
Shri C. Sadanandan Master’s life is the epitome of courage and refusal to bow to injustice. Violence and intimidation couldn’t deter his spirit towards national development. His efforts as a teacher and social worker are also commendable. He is extremely passionate towards youth…
— Narendra Modi (@narendramodi) July 13, 2025
Shri Harsh Vardhan Shringla Ji has excelled as a diplomat, intellectual and strategic thinker. Over the years, he’s made key contributions to India’s foreign policy and also contributed to our G20 Presidency. Glad that he’s been nominated to the Rajya Sabha by President of India.…
— Narendra Modi (@narendramodi) July 13, 2025
It’s a matter of immense joy that Dr. Meenakshi Jain Ji has been nominated to the Rajya Sabha by Rashtrapati Ji. She has distinguished herself as a scholar, researcher and historian. Her work in the fields of education, literature, history and political science have enriched…
— Narendra Modi (@narendramodi) July 13, 2025
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!