మలయాళ స్టార్ హీరో నివిన్ పాళీ హీరోగా అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్వం మాయ’. వినోదం, భావోద్వేగం అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది. గత 6 ఏళ్లుగా వరుస పరాజయాలు చూస్తున్న నివిన్ సర్వం మాయ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ‘ప్రేమమ్’ వంటి ఫీల్ గుడ్ కామెడి ఎంటర్టైనర్ గా ప్రశంసలు అందుకున్నారు. రిలీజ్ కు ముందు కేరళ ప్రీ-సేల్స్ ₹1.24 కోట్లకు పైగా బుకింగ్స్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Akhanda2Thandavam : 14వ రోజు అదరగొట్టిన అఖండ – 2.. బాలయ్య తాండవం
ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ వృషభ, ఉన్నిముకుందన్ ‘మిండియం పరంజుమ్’, షేన్ నిగమ్ ‘ హాల్’ సినిమాలు రిలీజ్ కాగా ప్రేక్షకులు సర్వం మాయ’ కు పట్టం కట్టారు. అజు వర్గీస్ మరియు రియా శి, నివిన్ పౌలీ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మౌత్ టాక్ తోనే హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ఈ సినిమా కేరళలో రూ. 3.5 కోట్లు వసూలు చేసి ఓపెనింగ్ డే రోజు మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి, నివిన్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఇక ఓవర్సీస్ లోను సూపర్ వసూళ్లు రాబట్టి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ. 8 కోట్లు గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ అంచనా. రెండవ రోజు కూడా రూ. 1.3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో సాలిడ్ రన్ చూపిస్తోంది. కేరళ బాయ్ నెక్ట్స్ డోర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.