మలయాళ స్టార్ హీరో నివిన్ పాళీ హీరోగా అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్వం మాయ’. వినోదం, భావోద్వేగం అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది. గత 6 ఏళ్లుగా వరుస పరాజయాలు చూస్తున్న నివిన్ సర్వం మాయ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ‘ప్రేమమ్’ వంటి ఫీల్ గుడ్ కామెడి ఎంటర్టైనర్ గా ప్రశంసలు అందుకున్నారు. రిలీజ్ కు ముందు కేరళ ప్రీ-సేల్స్ ₹1.24 కోట్లకు…