Preity Zinta: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ (PBKS) విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఈ గెలుపు వెనుక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన ప్రధాన కారణం. 41 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అయ్యర్, జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలో తడబడ్డ శ్రేయస్ అయ్యర్, నేహాల్ వాధేరా (48 బంతుల్లో 29)తో కలిసి 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోష్ ఇంగ్లిస్ (38) వేగవంతమైన ఇన్నింగ్స్‌తో పరుగులు చేయగా, చివర్లో అయ్యర్ 19వ ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను ఒక ఓవర్ ముందుగానే ముగించాడు.
Read Also: Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!
ఇకపోతే, మైదానంలో ఆటే కాదు.. బౌండరీల వెలుపల కూడా ఒక సెలబ్రేషన్ స్పెషల్‌గా నిలిచింది పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా. గెలుపు అనంతరం తన ఆనందాన్ని వ్యక్తీకరించిన విధానం అభిమానులను మంత్ర ముగ్దులను చేసింది. మైదానంలో శ్రేయస్ అయ్యర్‌ను హత్తుకుని, కోచ్ రికీ పాంటింగ్ తో సంబరాల్లో పాల్గొన్న ప్రీతి, ఒక స్టార్ ప్లేయర్‌కి ఇచ్చిన “వింక్” ( కన్ను కొట్టిన) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ప్రీతి జింటా ఎవరికీ కన్ను కొట్టిందన్న విషయం ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారింది.
Read Also: Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన మరో స్టార్ ప్లేయర్..!
ఇక సోషల్ మీడియాలో వైరల్ అయినా వీడియోలో గమనించినట్లయితే జర్సీ నెంబర్ 19 ధరించిన ఆటగాడికి కన్ను కొట్టిందన్న విషయం అర్థమవుతుంది. ఇక ఈ విదేవులపై సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వర్షం కురుస్తుంది. ఇక మొత్తానికి క్వాలిఫైర్ 2లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ జూన్ 3న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ లో తలపడనుంది. ఈ ఫైనల్ లో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర కావడం ఖాయం.
इस वीडियो में कुछ नोटिस किया आपने?
पंजाब किंग्स की मालकिन Preity Zinta को ध्यान से देखना pic.twitter.com/uHi0WyEEXD
— Bhanu Nand (@BhanuNand) June 2, 2025