టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 450 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అత్యంత వేగంగా ఈ మైల్ స్టోన్ అందుకున్న ఇండియన్ స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డును అతడు బ్రేక్ చేశాడు. అశ్విన్ తన 89వ టెస్టులో ఈ ఘనత సాధించడం విశేషం. ఇక టెస్టుల్లో ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ బౌలర్ కాగా.. ఓవరాల్‌గా 9వ ప్లేయర్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్‌ది రెండోస్థానం. అతని కంటే ముందు శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. ఈ శ్రీలంక మాజీ స్పిన్నర్ తన 80వ టెస్టు మ్యాచ్‌లోనే 450 వికెట్లు మైలురాయిని అందుకోవడం విశేషం.
Also Read: Dhruva Natchathiram: ఈ సినిమా చూడకుండానే పోతామనుకున్నాం.. చివరికి వచ్చేస్తోంది
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అలెక్స్ కారే వికెట్ తీయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో వేసిన తొలి 10 ఓవర్లలో అతనికి వికెట్ దక్కలేదు. 11వ ఓవర్లో కారేను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పిచ్ తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలించడంతో జడేజాతో కలిసి అశ్విన్ చెలరేగాడు. అంతకుముందు తొలి రోజు ఉదయమే ఇండియన్ పేసర్లు సిరాజ్, షమీ ఆస్ట్రేలియాను దెబ్బ తీశారు. సిరాజ్ తాను వేసిన తొలి బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో షమీ వేసిన బాల్.. వార్నర్ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో ఆసీస్ 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో స్మిత్, లబుషేన్ మూడో వికెట్ కు 82 పరుగులు జోడించి ఆదుకున్నారు. కానీ మిగతా ప్లేయర్లు విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 రన్స్‌కు ఆలౌటైంది.
Also Read: Lover Attack: ఆకతాయి దుశ్చర్య.. భర్తని వదిలెయ్ నాతో వచ్చెయ్.. కట్ చేస్తే..