RC16: టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న క్రేజీ సినిమాలో ఆర్సి 16 ఒకటి. ఈ సినిమాకు ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్. ఈ సినిమాపై సినీ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇండియన్ 2 సినిమా ఈవెంట్లో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను దర్శకుడు శంకర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని., ఇక సినిమా షూటింగ్ కేవలం ఇంకో 10 – 20% మాత్రమే మిగిలి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మొత్తం షూటింగ్ పూర్తి, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని శంకర్ తెలిపారు.
Prime Minister Modi: రికార్డు సృష్టించిన ప్రధాని.. మోడీకి ఎక్స్ లో 100 మిలియన్ల ఫాలోవర్స్..
ఇక ఈ సినిమా తర్వాత మరో క్రేజీ మూవీ ఆర్సి 16 లో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో తెలుగులో మొదటి సినిమా చేస్తుండగా.. ఇది ఆవిడకు రెండో సినిమా కానుంది. ప్రస్తుతం ఆర్సి 16 లో కూడా భారీ క్యాస్టింగ్ ఉండడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు ఆర్సి 16 సినిమా డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోలో బుచ్చిబాబుతోపాటు డిఓపి రత్నవేలు కూడా ఏఆర్ రెహమాన్ తో కలిసి ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే ఆర్సి 16 సినిమా సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది.
Child Kidnap: ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్.. ఏడుగురి సిబ్బందిపై వేటు