దాదాపు ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న నటుడు నారా రోహిత్ మళ్లీ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన నాలుగైదు చిత్రాలకు కమిట్ అయినట్లు సమాచారం.వాటిలో ‘ప్రతినిధి2’ చిత్రం కూడా ఉంది.. ఈ చిత్రం 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది.అయితే ఈ చిత్రం తో ప్రముఖ జర్నలిస్ట్ దేవగుప్తాపు మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.న్యూస్ రీడర్ గా ఆయన ఎంతగానో పరిచయం వున్న వ్యక్తి. నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీతో ఆయన దర్శకుడిగా మారుతున్నారు.ఈ సినిమా హీరో నారా రోహిత్ కెరీర్ లో 19 చిత్రంగా తెరకెక్కుతుంది.అలాగే పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..
బాణం సినిమాతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ వరుస సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతినిధి సినిమా నటుడు గా నారా రోహిత్ కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.ఈ సినిమాలో నారా రోహిత్ నటనకు ప్రశంసలు దక్కాయి. దీనితో ప్రతినిధి 2 సినిమాపై మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఎలాంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నారో అని ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు కొండకళ్ల రాజేందర్‌రెడ్డి నిర్మించనున్నారు. నారా రోహిత్‌తో పాటు సినిమాలోని ఇతర ముఖ్య నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. షూటింగ్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు .ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 25, 2024న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే చిత్రంలో ఇతర నటినటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.