Writer Chinnikrishna Relesaes a Video about Chiranjeevi: ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా మంచి క్రేజ్ అందుకున్నాడు కథా రచయిత చిన్ని కృష్ణ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు కానీ ఎందుకో అవేమీ ఆయనకి కలిసి రాలేదు. అయితే కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత చిన్ని కృష్ణ మీడియాకి సినీ పరిశ్రమకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయగా అది వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మెగాస్టార్ చిరంజీవికి ఆయన క్షమాపణలు చెబుతూ పద్మ విభూషణ్ అందుకున్నందుకు శుభాకాంక్షలు చెబుతూ కనిపించారు.. అన్నయ్యకు పద్మ విభూషణం వచ్చిందని చాలా సంతోషించానని ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపానని చిన్ని కృష్ణ చెప్పుకొచ్చారు. ఈ భూమి మీద పుట్టిన కొందరు తప్పులు చేస్తారు, తప్పులు మాట్లాడుతారు నేను కూడా అంతే నా మీద నమ్మకంతో నన్ను పిలిచి ఇంద్ర సినిమా చిరంజీవి గారిని నాకు బ్యాడ్ టైం నడుస్తున్న సమయంలో అనేక మాటలు మాట్లాడాల్సి వచ్చింది. పేర్లు చెప్పను కానీ కొందరి ఒత్తిడి వల్ల అన్నయ్య మీద అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది.
Vijay Political Party: బ్రేకింగ్.. రాజకీయాలలోకి స్టార్ హీరో విజయ్.. పార్టీ పేరు అధికారిక ప్రకటన
అలా మాట్లాడటం వల్ల నా భార్య- బిడ్డలు, బంధువులు, మిత్రులు సైతం భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా భగవంతుడిని, స్నేహితుల ముందు క్షమాపణ కోరుకుంటూనే ఉన్నాను. ఈ విషయంలో నేను ఎంతో అంతర్మథనం చెందాను. ఈ విషయం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి గారికి నేను ఎదుటి పడలేదు అయితే ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిందని తెలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం నా భార్య బిడ్డలు వారి బాగోగులు గురించి అడిగే విధానం చూసి నాలో నేనే ఎంతో మధనపడ్డానని అన్నారు. ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని తప్పు తెలుసుకుని క్షమించమని ఆయనను అడిగాను, వెంటనే పెద్ద మనసుతో క్షమించి దగ్గరకు తీసుకుని కధలేమైనా రాస్తున్నావా చిన్ని అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతే కాదు మళ్లీ కలిసి పని చేద్దాం మంచి కథ చూడు అన్నారు. ‘‘ఇంద్ర–2’’లాంటి ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని అవుతుందని త్వరలోనే అలాంటి మంచి వార్త అందరు వింటారని అనుకుంటున్నా అని ఆయన పేర్కొన్నారు. ఈసారి ఆయనతో పనిచేసే సినిమా దేశం గర్వించేలా ఉండాలని కోరుకుంటున్నాను అని జరిగిన పొరపాటుకు క్షమించాలని ఆయనని ప్రాధేయ పడ్డాను అంటూ ఆయన వీడియోలో పేర్కొనడం గమనార్హం.