బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..