Site icon NTV Telugu

Unstoppable-2 : బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో విడుదల

Prabhas Promo

Prabhas Promo

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే… ఇప్పటికే తొలి సీజన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న బాలయ్య.. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు సీజన్ 2లో భాగంగా రాజకీయ నాయకులు, పాన్ ఇండియా హీరోలు వచ్చి ఈ షోలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్‌తో కలిసి బాలయ్య టాక్ షోకు హాజరయ్యారు. ఈ సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ హైలెట్ గా మారిందనే చెప్పాలి. ఈ టాక్‌ షోకు హాజరైన ఎవరి ఎపిసోడైనా.. ఒక్కపార్ట్‌ గానే వచ్చింది.. కానీ.. ప్రభాస్‌ ఎపిసోడ్‌ రెండు భాగాలుగా రూపొందించారు.
Also Read : Satish Shah: “వీళ్లు ఫస్ట్ క్లాస్ టికెట్ ఎలా కొన్నారు.?”.. బ్రిటన్ అధికారి దిమ్మతిరిగే రిఫ్లై ఇచ్చిన బాలీవుడ్ నటుడు

అయితే.. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30 తారీకు స్ట్రీమింగ్ అయింది. ఇప్పటికీ ఈ ఎపిసోడ్‌ భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఇక రెండవ ఎపిసోడ్ జనవరి 6వ తేదిన స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఈ క్రమంలో ప్రభాస్ “అన్ స్టాపబుల్” రెండవ ఎపిసోడ్ ప్రోమో తాజాగా ఆహా టీం విడుదల చేసింది. ఈ ప్రోమోలో ప్రభాస్ తనతో పాటు షోలో పాల్గొన్న మరో హీరో గోపీచంద్ తో చేసిన కామెడీ మధ్యలో బాలకృష్ణ అడ్డుపడటం హైలైట్ గా మారింది. ఇక ఇదే సమయంలో “బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పరాజయం పాలైన దాని గురించి బాలయ్య ప్రశ్నలు వేసినట్లు ప్రోమోలో చూపించారు. మరింత సస్పెన్స్‌తో ఈ ప్రోమో సాగింది. ఈ ప్రోమోను చూస్తుంటే రెండవ ఎపిసోడ్‌ కోసం ఆసక్తి మరింత పెరుగుతోంది.
Also Read : Jogi Ramesh: పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చాం.. కుప్పం ప్రజల ప్రాణాలు కూడా తీస్తారా?

Exit mobile version