Prabhas Spirit: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ షురూ?
- ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..
- జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్?
- సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న న్యూస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న హీరో ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రాల విజయంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో తన మార్క్ నటనను అందిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏ.డి వంటి విజువల్ వండర్ సినిమాలతో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ భారీ ప్రాజెక్టుల మధ్యే మరొక ప్రత్యేక క్రేజ్ ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.
Read Also: Mass Jathara: ‘మాస్ జాతర’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందోచ్..
Also Read
ఇదివరకు మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘స్పిరిట్’ సినిమా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగా.. ఈ సమాచారం వారిలో హైప్ ను మరింత పెంచనుంది. ఇప్పటి వరకూ మాస్, లవర్ బాయ్ గా చిత్రాల్లో కనిపించిన ప్రభాస్.. మొదటిసారి పోలీస్ అవతారంలో హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందా అన్నది ఇప్పటిదాకా సస్పెన్స్‌గానే ఉండగా.. ముందుముందు మిగతా క్యాస్ట్, టెక్నికల్ టీమ్, స్టోరీ లైన్ పై మరిన్ని ఆసక్తికర సమాచారం రానుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?