Raja Saab: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘ది రాజాసాబ్’. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. అయినా కూడా నిన్న నైట్ షోస్ బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఈ రోజు కూడా రాజాసాబ్ బుకింగ్స్ బాగున్నాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. దీంతో వాళ్లు ఈ చిత్రానికి కొత్త బూస్ట్ ఇస్తున్నారు.
READ ALSO: TECNO Spark Go 3: IP64 రేటింగ్, లాంగ్ లైఫ్ పనితీరుతో జనవరి 16న వచ్చేస్తోంది..!
“రాజా సాబ్” చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్‌లో రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్‌గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన పలువురు ఫ్యామిలీ ఆడియన్స్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కారణంగా రాజాసాబ్ సినిమాకు కాస్త నెగిటివిటి వచ్చిందని అన్నారు. కానీ జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశారని చెప్పారు. ముఖ్యంగా డైరెక్షర్ మారుతీ తన జానర్ దాటి చేసిన ఈ కొత్త ప్రయత్నం బాగుందని, సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ను చూశామని పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తనదైన శైలిలో కామెడీ టైమింగ్స్‌తో అదరగొట్టాడని వివరించారు. నిజానికి ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్‌ను డీల్ చేయడంలో డైరెక్టర్ మారుతీ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పారు. ఫ్యామిలీ ఆడియన్స్ అదిరే రెస్పాన్స్‌తో ఈ రోజు కూడా రాజాసాబ్ బుకింగ్స్ జోరు కొనసాగుతుంది. ఈ సినిమా మేకర్స్ కూడా మరింత ఉత్సాహంగా చిత్రాన్ని ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేస్తే సంక్రాంతి రాజుగా ప్రభాస్ నిలుస్తాడని ట్రేడ్ పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజాసాబ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. దానికి తోడు వింటేజ్ ప్రభాస్ కామెడీ ఈ సినిమాకు అదనపు బలంగా ఉండనే ఉంది. నేటి నుంచి కొత్తగా ఈ సినిమాకు మరిన్ని సీన్స్ కూడా యాడ్ చేస్తామని డైరెక్టర్ మారుతి చెప్పడం, మొత్తానికి రాజాసాబ్ సినిమాకు పాజిటీవ్ అంశాలుగా చెప్పవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.
READ ALSO: Rishabh Pant: అయ్యో.. రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడే!