నథింగ్ సబ్-బ్రాండ్ అయిన CMF తన మొదటి ఓవర్-ఈయర్ హెడ్‌ఫోన్స్ అయిన CMF Headphone Proని భారత మార్కెట్‌లో జనవరి 13, 2026న అధికారికంగా లాంచ్ చేయనుంది. గ్లోబల్ మార్కెట్‌లో సెప్టెంబర్ 2025లో ఇప్పటికే విడుదలైన ఈ హెడ్‌ఫోన్స్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరతో ప్రీమియం ఫీచర్లు అందించడంపై దృష్టి పెట్టిన CMF ఈ ఉత్పత్తితో ఆడియో మార్కెట్‌లో బలమైన ఎంట్రీ ఇవ్వనుంది. CMF Headphone Pro డిజైన్ చాలా కలర్‌ఫుల్‌గా, యూత్‌ఫుల్‌గా ఉంటుంది.
Also Read:Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు..
గ్లోబల్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న లైట్ గ్రే, డార్క్ గ్రే, లైట్ గ్రీన్ కలర్లే భారతదేశంలో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇంకా స్వాపబుల్ ఈయర్ కుషన్స్ (ఎర్ ప్యాడ్స్) ఫీచర్ ఉంది. వీటిని సులభంగా మార్చుకోవచ్చు, ఆరెంజ్ వంటి అదనపు కలర్లలో కూడా లభిస్తాయి (సెపరేట్‌గా కొనుగోలు చేయవచ్చు). ఇది హెడ్‌ఫోన్స్‌ను మీ స్టైల్‌కు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఇస్తుంది.
Also Read:Bihar: జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగికి షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ
40mm కస్టమ్ డైనమిక్ డ్రైవర్లు, Hi-Res ఆడియో సపోర్ట్, LDAC కోడెక్ (990kbps వరకు) సౌండ్ క్వాలిటీ ఉంటుంది. 40dB వరకు నాయిస్ బ్లాక్ చేస్తుంది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఉంది. ANC ఆఫ్‌లో 100 గంటల వరకు ప్లేబ్యాక్, ANC ఆన్‌లో 50 గంటల వరకు. 5 నిమిషాల ఛార్జ్‌తో 4-5 గంటల ప్లేబ్యాక్. టచ్ కాకుండా ఫిజికల్ బటన్స్, రోలర్ డయాల్ (వాల్యూమ్, ప్లే/పాజ్, ANC టాగిల్), ఎనర్జీ స్లైడర్ (బాస్ & ట్రెబుల్ మాన్యువల్‌గా అడ్జస్ట్ చేయడానికి), కస్టమైజబుల్ క్విక్ యాక్షన్ బటన్ ఉంటుంది. Nothing X యాప్ ద్వారా EQ, కంట్రోల్స్ కస్టమైజేషన్, స్పేషియల్ ఆడియో, బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైస్ పెయిరింగ్ చేసుకోవచ్చు. గ్లోబల్‌గా $99 (సుమారు రూ.8,000-రూ.10,000) ధరతో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో కూడా రూ.10,000 లోపు ధరలో రావచ్చని అంచనా.