Kalki 2898 AD Movie 4 Days Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్’ ఎక్స్‌లో పోస్టు చేసింది. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి.. నాలుగో రోజు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు రూ.191.5 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. రెండవ రోజు రూ.95.3 కోట్ల వసూళ్లను సాధించింది. మూడు రోజుల్లో రూ.415 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నాలుగో రోజైన ఆదివారం వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఈ మూవీ వారంతానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కల్కి వసూళ్లపై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Shatrughan Sinha: కూతురు పెళ్లైన వారానికే ఆసుపత్రి పాలైన స్టార్ హీరో!
వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కి 2898 ఏడీ సినిమాను నిర్మించారు. కల్కిలో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, కీలక పాత్రలు చేయగా.. దిశా పటాని, శోభన, అన్నా బెన్, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఆర్జీవీ, కేవీ అనుదీప్, అవసరాల శ్రీనివాస్, ఫరియా అబ్దుల్లాలు గెస్ట్ రోల్స్ చేశారు.