Prabas Kalki 2898 AD : తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి 2898 AD. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచం నలుమూలల నుంచి హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి ఇదివరకే తెలిసింది. కేవలం ఒక్క ప్రభాస్ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు రెండుసార్లు సాధించిన ఏకైక హీరోగా నిలిచాడు. తాజాగా ఈ సినిమా సాధించిన విజయం పట్ల హీరో ప్రభాస్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ వీడియో ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. కల్కి 2898 AD సినిమా అఫీషియల్ పేజ్ నుండి ఈ వీడియోను సినిమా బృందం పోస్ట్ చేసింది.
RC16: రెహమాన్‌తో బిజీగా బుచ్చిబాబు.. మంచి స్పీడ్ మీద ఉన్నారే..
సినిమా భారీ విజయం సాధించడం పట్ల ప్రభాస్ తన అభిమానులకు థాంక్స్ తెలిపారు. ఈ సినిమా కోసం 5 ఏళ్లపాటు ఎంతో కష్టపడి తెరకెక్కించిన దర్శకుడు నాగ అశ్విన్, అలాగే సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ప్రొడ్యూసర్ అశ్విని దత్ లకు ఆయన స్పెషల్ థాంక్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటి నటులు కమలహాసన్, అమితాబచ్చన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే, వారి గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. కమల్ హాసన్ సర్, అమితాబచ్చన్ సర్ ల సినిమాలు చూస్తూ తాను పెరిగిన వాడినని.. ఇప్పుడు వాళ్లతో నటించడం పట్ల చాలా సంతోషం అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Trump T-shirts: ట్రంప్ దాడిపై “టీ-షర్ట్‌లు”.. ఇంత ఫాస్ట్‌గా ఎలారా..?
ఇక మోస్ట్ గార్జియస్ మహిళ దీపికా పదుకొనే సినిమాలో నటించడం పట్ల థాంక్స్ తెలిపాడు. తర్వాత రాబోయే కల్కి 2 చిత్రం మరింత గ్రాండ్ గా ఉండబోతుందంటూ ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్ లాంటి నటీనటులు ముఖ్యపాత్రలలో నటించారు.
A sweet note from our Bhairava, Karna a.k.a #Prabhas, as we celebrate the blockbuster success of #Kalki2898AD ❤️
– https://t.co/MjXlFOCk12#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/yo5COEoLKc
— Kalki 2898 AD (@Kalki2898AD) July 14, 2024