AP DGP: శాంతి భద్రతలపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DGP: వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ కాన్ఫరెన్స్ పలు శాఖలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు. జిల్లా స్థాయిలో యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. గంజాయి సాగు, రవాణాలోని కింగ్ పిన్‌లను పట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలతో నిఘా పెంచుతామన్నారు. నరసాపురం ఎంపీడీవో అదృశ్యం కేసులో కూడా సీసీ కెమెరాలను వినియోగించామని డీజీపీ స్పష్టం చేశారు.
గంజాయి నివారణపై ప్రత్యేకంగా చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో గంజాయి నివారణ మీద సమీక్షలు చేపట్టాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు సూచించారు.గంజాయి విషయంలో హాట్ స్పాట్స్ ఆఫ్ ప్రొడెక్షన్.. హాట్ స్పాట్స్ ఆఫ్ కన్సప్షన్ అనేది ఐడెంటిఫై చేయాలన్నారు. గంజాయి నెట్ వర్క్‌ను డిస్ కనెక్ట్ చేయాలని ఆదేశించారు. ముందుగా గంజాయి సాగు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. పక్క రాష్ట్రం నుంచి గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.సైబర్ సెక్యూర్టీ విషయంలో పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ విషయంలో ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ప్రతి జిల్లాకూ చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి రూ. 5 కోట్లను కేటాయిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
Read Also: AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు
ఎక్సైజ్ శాఖపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్‌డీపీఎల్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా నిఘా పెట్టాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం ఎక్కడికి వెళ్లిందో అందరూ చూశారని.. నెల రోజుల్లో మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం ప్రారంభించనున్నామని స్పష్టం చేశారు.
పౌర సంబంధాల శాఖపై ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమాచార యుద్దం ఫీల్డు నుంచి ఫీడ్‌కు వచ్చిందన్నారు. దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. జరుగుతున్న పరిణామాలను ఏది నిజం.. ఏది దుష్ప్రచారం అనేది ప్రజలకు తెలపాలని సూచించారు. జిల్లా స్థాయిలో కూడా మీడియా మానిటరింగ్ టీంలు ఉండాలన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగితే.. వాటిని ఎక్కడికక్కడ తిప్పికొట్టే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!