Pope Francis: స్వలింగ సంపర్కంపై క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను అన్యాయం అని పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. దేవుడు తన పిల్లలు ఎలా ఉన్నా ప్రేమిస్తాడని ఆయన చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను, అలాంటి వారి పట్ల వివక్షను ప్రదర్శించే చట్టాలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని కేథలిక్ బిషప్‌లు సమర్థిస్తున్నారని ఆయన అన్నారు. అందరి గౌరవాన్ని బిషప్‌లు గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. అసోసియేటెడ్ ప్రెస్‌తో మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. స్వలింగసంపర్కం నేరం కాదని అన్నారు. దేవుడికి అందరిపై సమానమైన ప్రేమ, దయ ఉంటాయని… బిషప్‌లు కూడా అదే విధంగా వ్యవహరించాలని అన్నారు. హోమో సెక్సువాలిటీ విషయంలో నేరం వేరు, పాపం వేరని… ఈ తేడాను మొదట తెలుసుకుందామని చెప్పారు. ప్రతి ఒక్కరి గౌరవాన్ని గుర్తించడానికి ప్రత్యేకించి బిషప్‌లు మార్పు ప్రక్రియను చేపట్టాలని అన్నారు.
Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక అలా చేస్తే రీయింబర్స్‌మెంట్
ఇటువంటి చట్టాలను రద్దు చేయాలని ది హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పోరాడుతోంది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, స్త్రీతో స్త్రీ కానీ, పురుషునితో పురుషుడు కానీ పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని సుమారు 60 దేశాల చట్టాలు చెప్తున్నాయి. వీటిలో 11 దేశాల్లో ఈ నేరానికి మరణ శిక్ష కూడా విధించవచ్చు. ఇటువంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్య రాజ్య సమితి పదే పదే పిలుపునిస్తోంది. వ్యక్తిగత గోప్యత, వివక్ష నుంచి విముక్తి వంటి హక్కులకు ఈ చట్టాల వల్ల విఘాతం కలుగుతోందని తెలిపింది. సెక్సువల్ ఓరియెంటేషన్, జెండర్ ఐడెంటిటీ వంటివాటితో సంబంధం లేకుండా అందరి మానవ హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత అంతర్జాతీయ చట్టం ప్రకారం అన్ని దేశాలకు ఉందని తెలిపింది.
.