Maharashtra: దారుణం.. ఆ కారణంతో నలుగురు దళితులను చెట్టుకు వేలాడదీసి కొట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: ఆ మధ్యకాలంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో దళితుడిపై మూత్రం పోసి హింసించారు. తరువాత దళితుడిని ఫ్రీగా చికెన్ ఇవ్వలేదని చితకబాదారు. ఇక ఓ ప్రభుత్వ ఉద్యోగి దళిత యువకుడిని కొట్టి అతనితో చెప్పులు నాకించాడు. ఇలాంటి ఘటనలు అని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి చర్యలను అరికట్టడానికి పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా దేశంలో ఏదో ఒక చోట దళితులపై జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమ మేకలను దొంగలించారనే కారణంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టి హింసించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శ్రీరామ్‌పుర్ తాలుక పరిధి హరేగాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: Rahul Gandhi : చిన్నారిని ఆటోగ్రాఫ్ ఇస్తావా అని అడిగిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
Also Read
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
వివరాల్లోకి వెళ్తే.. తమ మేకలు, పావురాలు కనపించక పోవడంతో తమ ఇంటి పక్కన ఉన్న దళిత యువకులపై ఒకరికి అనుమానం వచ్చింది. దీంతో కొంతమందితో కలిసి ఆగస్టు 25న హరేగాన్‌లో ఆరుగురు వ్యక్తులు దళిత కుటుంబాలకు చెందిన 20 ఏళ్ల వయసున్న నలుగురి ఇళ్లకు వెళ్లి తమవెంట రావాలని అడిగారు. వారు రావడానికి అంగీకరించకపోవడంతో వారిని బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. యువరాజ్ గలాండే, మనోజ్ బోడకే, పప్పు పార్కే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బొరాగేలు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రితో చేర్పించారు పోలీసులు. బాధితుల్లో ఒకరైన శుభం మగడే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!