Saripodhaa Sanivaaram Trailor: అతి త్వరలో విడుదల కాబోయే సినిమాలలో ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్న సినిమాలలో నాచురల్ సార్ నాని నటించిన సినిమా.. “సరిపోదా శనివారం” ఆగస్టు 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి తాజాగా హీరో నాని తన సోషల్ మీడియా కాస్త ద్వారా భగభగభగ.. భగభగమని.. అంటూ ఓ పోస్టర్ ను పోస్ట్ చేశాడు.
Trai New Rule: ఇకపై అలాచేస్తే మీ సిమ్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్‌లో..
ఈ పోస్టర్లో నాని సీరియస్ లుక్ లో కనబడుతుండగా.. సినిమా ట్రైలర్ ని 13 ఆగస్టున విడుదల చేయబోతున్నట్లు తెలియజేశాడు. ఇదివరకే ఈ సినిమాకు విడుదలైన టీజర్, పోస్టర్ల తో ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకుడుగా చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులలో మంచి బజ్ నెలకొని ఉంది. నాని కెరియర్ లో మరో బ్లాక్ పాస్టర్ హిట్ ఖచ్చితంగా ఆగిపోతుందని ఇండస్ట్రీలో టాక్. ఇక నాని ట్రైలర్ ఆగస్టు 13న విడుదల చేబోతున్నట్లుగా తెలపడంతో.. ఇప్పుడు అందరి ఆలోచనలు ట్రైలర్ పై పడ్డాయి. సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. జోక్స్ జిబొయ్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
భగభగభగ
భగభగమని#SaripodhaaSanivaaram TRAILER on 13th. pic.twitter.com/0wj4LK8Qo0— Nani (@NameisNani) August 11, 2024