ఇటీవల లిక్కర్ స్కామ్‌లో దోషులు తెరమీదికి వస్తున్నారని వ్యాఖ్యానించారు పొన్నాల లక్ష్మయ్య. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను ఈడీ విచారణ చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఆ సమాచారం బయటకు రాకుండా చేశారని ఆయన అన్నారు. దొంగ పాస్ పోర్ట్ కేసు, కేంద్ర మంత్రిగా సహారా కుంభకోణం కేసులున్నాయని, అవి ఎందుకు విచారణ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. వీటిని కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్ ను ప్రచారం కోసం వాడుతున్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్ దొందూ దొందే అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్ కేసు ఎందుకు జాప్యం అవుతుందని, ఎక్కువ లిస్టింగ్ కంపెనీలు ఉన్నా అదానీ కంపెనీ షేర్లు ఎందుకు కొన్నారని ఆయన అన్నారు. ఆధారాలు ఉన్నాయని చెప్తున్న పెండింగ్ కేసులు కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Gun Culture: గన్‌కల్చర్‌పై కన్నెర్ర.. ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు
ఇదిలా ఉంటే.. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసి కస్టడీకి తీసుకోగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను విచారణ చేసి సంచలనం సృష్టించిన ఈ కేసులో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న నితీష్ రాణా తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. 2015 నుంచి ఈడీకి స్పెషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తోన్న నితీష్ రాణా.. ఇలా రాజీనామా చేయటంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
Also Read : Naked On Street: వీధిలో నగ్నంగా నడిచాడు.. తన బట్టలు ఎక్కడో వదిలేశాడో కూడా తెలీదంట!