Ponguleti Srinivas Reddy : కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల జోరు పెరిగింది. ఆయా పార్టీలు ప్రజలును ఆకర్షించేందుకు వారి పార్టీలు ప్రకటించిన మేనిఫేస్టోతో పాటు.. మరిన్ని వరాలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రచారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 72-78 గెలుచుకో బోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు పొంగులేటి. మీరు అభిమానించే మీ శ్రీనన్న ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉండబోతున్నాడన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తానన్నారు. కొత్తగూడెం నేను నిలబడే ఆలోచన చేయలేదు, నేను నిలబడే నియోజకవర్గం కోసం, నా కోసం నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు. నేను పోటీ చేస్తున్న చేస్తున్న పాలేరు నియోజకవర్గం కంటే మిగతా నియోజకవర్గాల్లో 75శాతం టైం కేటాయిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ ఆదేశానుసారం పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ కి కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి అభిమానులుగా పార్టీ ఆదేశానుసారం చిత్తశుద్ధితో పనిచేస్తే కూనంనేని సాంబశివరావు గెలుపు తథ్యమన్నారు.
Also Read : Sreeleela: శ్రీ లీల ప్రేమలో పడిందా? ఇదేంటి ఇలా షాక్ ఇచ్చింది?
Also Read
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నేను కూడా పోటీ చేయాలని అనుకోలేదు కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర పార్టీ నాయకులు ఒత్తిడి, నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా సీపీఐ నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నాను. పొంగులేటి వన్ మాన్ ఆర్మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పొంగులేటికి ప్రజా బలం ఉంది తనను వేరే విధంగా ఆలోచన చేయొద్దు. పాలేరు లో సీపీఐ పొంగులేటికి పూర్తి మద్దతు ఇస్తున్నది, ఖమ్మం లో తుమ్మల నాగేశ్వరరావు కు సీపీఐ మద్దతు ఇస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆశించిన విధంగా 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు మిత్రపక్షాలు గెలుపు తథ్యం. కొత్తగూడెం స్థానం గెలవక పోతే వ్యక్తిగతంగా తనకు, తన పార్టీకి, మిత్ర ధర్మం పాటించలేదని కాంగ్రెస్ కు చెడ్డ పేరు వస్తుంది. ఎవరికీ ఇబ్బందులు కలిగించను, ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించను. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. పదవి కోసం పోటీ చేయడం లేదు.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
-
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!