Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
- మోదీ తండ్రిని ప్రస్తావిస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వివాదం
- ఖర్గే వ్యాఖ్యలు మర్యాద హద్దులు దాటాయని అమిత్ షా విమర్శ
- కాంగ్రెస్‌కు మిగిలింది దూషణల రాజకీయాలేనని షా ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kharge Controversy: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఖర్గేలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని కుటుంబంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖర్గే అన్ని మర్యాద హద్దులు దాటారని విమర్శించారు. కాంగ్రెస్ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో తిట్ల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రజలే బుద్ధి చెబుతారు..
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన అమిత్ షా.. ప్రధాని మోడీని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ గతంలో కూడా వ్యాఖ్యలు చేసిందని, గతంలో మోడీని ‘‘మృత్యు వ్యాపారి’’ అని, ఆయన పేదరికాన్ని ప్రస్తావిస్తూ ‘‘టీ అమ్మేవాడు’’ అంటూ ఎగతాళి చేశారని ఆరోపించారు. వరస ఎన్నికల్లో ఓటములతో కాంగ్రెస్ నిరాశకు గురైందని, ప్రధాని కుటుంబంపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు ప్రతీసారి ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని అన్నారు.
Also Read
- Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
- Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
- Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
- Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
కాంగ్రెస్ వైఖరికి నిదర్శనం..
బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఖర్గే వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. బహిరంగ వేదికపై మర్యాదకు విరుద్ధమైన భాషను వాడారని, ఇది కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు హుందాతనం, సంయమనం పాటించాలని అన్నారు. మరణించిన వ్యక్తుల్ని రాజకీయ ప్రసంగాల్లోకి లాగడం సరైన పద్ధతి కాదని, ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి పట్ల గౌరవం, మర్యాద పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. విధానాలు, ఆలోచనల ఆధారంగా రాజకీయంగా పోటీపడలేక కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ఆరోపించారు.
వివాదం ఏమిటి..?
అంతకుముందు ఆదివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఓ వ్యక్తి ‘‘మోడీ వెళ్లరు’’ అని ఆయన అధికారంలోనే ఉంటారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించుకున్న ఖర్గే..‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా ఎస్ఐఆర్ ప్రక్రియపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆపార్టీ కార్యకర్తలు యువకుడిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!