కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రోజురోజుకు పెనమలూరు పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెనమలూరు ఇంఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామమైన సంగతి తెలిసిందే.
పెనమలూరు టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి రాక రచ్చ రేపుతోంది. ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిక ఖాయం కావటంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం ఆందోళనకు గురవుతోంది. సీటుకు ఎసరుపెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు జరుగుతుండడంతో టికెట్ రాదేమోననే ఆందోళనలో బోడే ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.