Population Increased: చైనాలో జననాల రేటు గత రెండు సంవత్సరములుగా నిరంతరం తగ్గుతోంది. ఈ పరిస్థితిలో చైనా అనేక విధానాలను ప్రకటించింది. ఇందులో పిల్లల పుట్టుకపై సబ్సిడీ విధానం, అలాగే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబ సభ్యులకు పన్ను తగ్గింపు వంటి విధానాలు ఉన్నాయి. జననాల రేటును పెంచడానికి, ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రజలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిల్లల జనన రేటును పెంచేందుకు వీలుగా చైనా స్టేట్ కౌన్సిల్ సోమవారం…
హాంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ వినూత్న ఆలోచనతో కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Putin: రష్యా ఎప్పుడూ లేనంతగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైశాల్యపూరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్న రష్యాలో అందుకు తగ్గట్లుగా జనాభా లేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత దాదాపుగా 3 లక్షల మంది మరణించారు. దీనికితోడు 1990 నుంచి ఆ దేశంలో జననాల రేటు క్రమంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా జనభాను పెంచడమే ‘‘ రాబోయే దశాబ్ధాల్లో మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. మంగళవారం మాస్కోలో…
China: అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా, అమెరికాతో కయ్యం పెట్టుకుంది. ఇవిలా ఉంటే అన్నింటి కన్నా ముఖ్యంగా ఆ దేశాన్ని మరో సమస్య పట్టిపీడిస్తోంది. అక్కడి ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు ససేమిరా అంటున్నారు. సింగిల్ గా ఉండటమే బెస్ట్ అని అలాగే కంటిన్యూ అవుతున్నారు. దీంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.
Record-Low Weddings: ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయస్సులో జరిగితేనే బాగుటుందని పెద్దలు చెబుతుంటారు.. అయితే, ఇది క్రమంగా గాడి తప్పుతుందేమో అనిపిస్తోంది.. పెళ్లిని క్రమంగా వాయిదా వేస్తున్నారు నేటి యువతి.. ఉద్యోగం, సెటిల్‌మెంట్.. ఇలా చూస్తూ.. పెళ్లికి కామాలు పెడుతూ పోతున్నారు. కొన్ని దేశాల్లో మరీ ఇది తీవ్రంగా ప్రభావం చూపుతోంది.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాపులేషన్ భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా,…
పోలండ్‌కు చెందిన అధికార పార్టీ నేత జరోస్లావ్ కాజిన్స్కీ యువతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జననాల రేటు పడిపోవడానికి కారణం యువతులు అధికంగా మద్యపానం చేయడమేనని పాలకపక్ష నాయకుడు జరోస్లావ్ కాజిన్స్కీ వ్యాఖ్యానించారు.
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లకే పరిమితం కావడంతో జననాల రేటు పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో సంతానోత్పత్తిపై దృష్టి సారిస్తారని అనుకున్నారు. కరోనా మహమ్మారి ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపించాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. పోయిన ఉద్యోగాలపై దృష్టి సారించారు. దీంతో 2020లో జననాల రేటు తగ్గింది. 2019 లో అమెరికా మొత్తం మీద 37.5 లక్షల మంది…