Attack on CM YS Jagan Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. దర్యాప్తు ముమ్మరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on CM YS Jagan Case: సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. 20 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్‌టవర్ నుంచి వెళ్లిన కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్కమింగ్, ఔట్‌గౌయింగ్ కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా, వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన క్లూస్ టీమ్స్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్నారు. కేసును దర్యాప్తును డీజీపీ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంత దూరం నుంచి జగన్‌కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.
సీఎం జగన్ వాహనానికి ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‌తో పాటు పోలీస్ వాహనాలకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాలకు కెమెరాలు ఉన్నప్పటికీ ఫోకస్ లైట్స్‌తో క్లియర్‌గా వీడియోలు కనిపించడం లేదు. గంగానమ్మ గుడి ఐసోలేషన్ లోకేషన్లో కాల్ డేటా డంప్, సాంకేతిక డేటా ఫిల్టల్ చేస్తున్నారు. ఈ కేస్ దర్యాప్తులో దాదాపు 20 టీమ్‌లు పని చేస్తున్నాయి. విజయవాడలో రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తుల కార్యకలాపాలపైనా ఫోకస్ చేశారు. రౌడీ షీటర్లు ఏం చేస్తున్నారు..? ఎక్కడున్నారనేదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు.. దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. నిందితుల గురించి ఏదైనా సమాచారం ఉన్నా, తెలిసినా తమకు తెలపాలని పోలీసులు కోరారు. దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. 9490619342, 9440627089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సెల్ ఫోన్ వివరాలు, వీడియో రికార్డింగ్స్ ఉన్నా పంపాలన్నారు. వివరాలు తెలిపిన వారి పేపర్లను రహస్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.
Also Read
మరోవైపు, రాయి దాడి తర్వాత మళ్లీ జనంలోకి వచ్చారు సీఎం జగన్. నిన్నంతా రెస్ట్ తీసుకున్న జగన్.. 15వ రోజు బస్సుయాత్రలో పాల్గొన్నారు. దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు. క్రేన్లతో గజమాలలు వేయకుండా నియంత్రించాలని పోలీసులకు సీఎం సెక్యూరిటీ సూచించారు. బస్సుయాత్రలో సీఎంకు గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. సీఎం పర్యటించే మార్గంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలందాయి. మరీ అవసరమైతేనే బస్సు పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తల అనుమతించాలని తెలిపింది. వీలైనంత వరకు బస్సులో కూర్చునే యాత్ర చేయాలని నిఘావర్గాలు సూచించాయి. అంతే కాకుండా సభల్లో ర్యాంప్ వాక్ కూడా చేయొద్దని సూచించింది.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!