కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఈ రోజు నుంచీ వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రం లో పర్యటిస్తున్నట్లు సమాచారం.రాష్ట్రం లో ఎన్నికల ఏర్పాటుపై అధికారులు విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నారు.సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అయిన ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చేరుకున్న బృందం లో పలువురు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, అండర్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు కొంతమంది ఉన్నత అధికారులు కూడా ఉన్నారు.తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాలం త్వరలో ముగియనుంది.రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాటు,శాంతి భద్రతలపై ఈ అధికారుల బృందం విస్తృతంగా చర్చించనుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఎన్నికల కు సంబంధించి కీలక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు.. ఈ సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి అయిన వికాస్ రాజ్, అలాగే పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరుపనున్నారు.వరుసగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు మరియు పోలీసు సూపరింటెండెంటుల తో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది..
అయితే తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.. ఈ సంవత్సరం నవంబర్ లో షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం కూడా ఉంది.ఈ విధంగా తెలంగాణ సాధారణ ఎన్నికల నిర్వహణ కు సన్నద్ధమవుతుంది. వరుసగా అధికారులకు ట్రైనింగ్ ను కూడా ఇస్తూ వస్తోంది. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది.ముందుగా ఓటర్ల నమోదు చేయడం తరువాత పోలింగ్ ఆ తరువాత ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రాసెస్ పై శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రం లో మూడు సంవత్సరాలు ఒకే ప్రాంతం లో పనిచేస్తున్న అధికారుల బదిలీ ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తం గా బదిలీల ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. వచ్చే నెల 31 వ తేదీ లోపు ఈ బదిలీల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయనున్నట్లుగ తెలుస్తుంది.