Bharateeyudu Re-Release: భారతీయుడు రీ-రిలీజ్.. నేడు ట్రైలర్ విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu-1 Re-Release Trailer Out Today: 1996లో విడుదలైన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లోనే పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అటు కమల్, ఇటు శంకర్ కెరియర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించగా.. కమల్ ద్విపాత్రాభినయం చేశారు. దేశాన్ని కేన్సర్‌లా పట్టి పీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు ‘సేనాపతి’ చేసిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది.
భారతీయుడు సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూన్ 7న తెలుగు, తమిళంలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నేడు ట్రైలర్ కూడా విడుదల కానుంది. ‘బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని మళ్లీ చూడ్డానికి సిద్ధంగా ఉండండి. భారతీయుడు – 1 రీ-రిలీజ్ ట్రైలర్ వస్తోంది. వేచి ఉండండి. జూన్ 7న థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది’ అని నిర్మాత ఏఎం రత్నం ట్వీట్ చేశారు. జులై 12న ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తొలి భాగంను రీ-రిలీజ్ చేస్తుండడంతో కమల్ అభిమానులను ఉత్సాహంగా ఉన్నారు.
Also Read
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
Also Read: Today Gold Price: బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!
భారతీయుడుకు కొనసాగింపుగా ఇండియన్ 2 తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండో భాగాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొదటి భాగంలో మనీషా కొయిరాలా, సుకన్య, కౌందమణి, సెంథిల్ తదితరులు నటించారు.
Get ready to re-live the blockbuster experience once again! 🤩#Bharateeyudu – 1 Re-Release Trailer Out TOMORROW, Stay Tuned!!💥
Releasing worldwide in Telugu & Tamil on June 7th at theatres near you! 🔥@ikamalhaasan @shankarshanmugh @arrahman @mkoirala @UrmilaMatondkar… pic.twitter.com/wC36I7saE6
— AM Rathnam (@AMRathnamOfl) May 26, 2024
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!